Sunday 27 May 2018

దేశంలో నార్మల్ డెలివరీలను ప్రోత్సహించేందుకు పక్కా ప్రణాళికలను రచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సిజేరియన్ ఆపరేషన్లకు చెక్ పెడుతూ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఆయుష్మాన్‌ భారత్‌–జాతీయ ఆరోగ్య సంరక్షణ మిషన్‌(AB– NHPM )కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఆస్పత్రులు సిఫార్సు చేస్తేనే ఈ స్కీం కింద ప్రైవేటు హస్పిటల్స్ సిజేరియన్‌ ఆపరేషన్‌ నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది AB-NHPM. ఏ కారణం చేత ప్రభుత్వ ఆస్పత్రి సిజేరియన్‌ కు సిఫార్సు చేసిందో స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. దేశంలో సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మొదట సహజ ప్రసవాలను ఈ స్కీంలో చేర్చలేకపోయినా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల లేమీ, ఇతర కారణాలతో ప్రైవేటు ఆస్పత్రులకు సిఫార్సు చేస్తే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపింది. నిరుపేద మహిళలు ప్రవేట్ హస్పిటల్ కి వెళ్తే, నార్మల్ డెలివరీ చేయకుండా..సిజేరియన్ చేస్తూ అధిక డబ్బులు వసూలు చేస్తున్నాయని ఫిర్యాదు వస్తున్నాయని తెలిపింది. నార్మల్ డెలివరీలతో మహిళలు ఆరోగ్యంగా ఉంటారని ఇదీ ఓ కారణంగా చెప్పింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ..అవసరమైతే తప్పా..సిజేరియన్ చేయకూడదని, చేయాల్సి వస్తే ప్రభుత్వం అనుమతిని తప్పనిసరి చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిది. 2015-16లో నిర్వహించిన జాతీయ కుటుంబఆరోగ్య సర్వే-4 ప్రకారం సిజేరియన్ కాన్పుల్లో 40.9 శాతం ప్రైవేట్ హస్పిటల్స్ లోనే జరగగా..ప్రభుత్వ హస్పిటల్స్ లో 11.9శాతమే జరిగాయని వెల్లడించింది.


No comments:

Post a Comment