Sunday 11 December 2016

MINISTERS THUMMALA and KDIAUMSRIHARI INAUGURATION THE ADDITIONAL CLASSROOM

రాష్ట్రానికే ఆదర్శంగా కిష్టారం గ్రామాన్ని తీర్చి దిద్దుతానని, గ్రామ అభివృద్ధికి ఎవేవి అవసరమో అన్ని చేయడం జరుగుతుందని, తాను ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన కిష్టారం గ్రామం, పాఠశాలకు ఎంతో రుణపడి ఉన్నానని రాష్ట్ర రోడ్లు భవనాలు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం సత్తుపల్లి మండలం కిష్ణారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల స్వర్టోత్సవాల కార్యక్రమాలలో తుమ్మల నాగేశ్వరరావు ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరితో కలిసి 85 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను, డిజిటల్ తరగతి గదుల నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాలు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పాతకాలంలో ఉన్న ఆప్యాయతలు, క్రమశిక్షణ ప్రస్తుతం కనుమరుగవుతున్నాయని అన్నారు. కొత్తతరం, పాతతరం వారిలాగా గ్రామ కీర్తిని ప్రతిష్టింప చేసే విధంగా నడుచుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన పూర్వ విద్యార్థుల మిత్రులతో కలిసి చదువుకునే రోజుల్లోని విషయాలను గుర్తు చేసుకున్నారు. ఆప్యాయంగా పలకరించుకోవడం జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆనాటి పూర్వ విద్యార్ధులు సన్మానించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఆసక్తి ఈ పాఠశాల నుండే కలిగిందన్నారు. కిష్టారం గ్రామస్తుల ఆసిస్సులు, సహకారం తనని ఇంతటి స్థాయికి తీసుకు వచ్చాయన్నారు. పాఠశాల కావల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. అనంతరం పాఠశాల గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మాణంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి బాగస్వామి కావడం ఆనందనంగా ఉందన్నారు. గతంలో కూడా ఇద్దరం కలిసి మంత్రులుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు . ఇప్పడు కూడా అదే రకమైన అవకాశం వచ్చిందని అన్నారు. విద్యా పరంగా వెనుకబాటు తనాన్ని పోగొట్టి ముందంజలో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దేశంలో ఎక్కడా అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో మంచి కృషి జరుగుతుందని మంత్రి చెప్పారు. గురుకుల పాఠశాలల్లో కార్పోరేట్ విద్యా సంస్థలకు తీర్చి దిద్దడం చంద్రశేఖర్రావు లక్ష్యమని అన్నారు.8 80 పి.జి ఉచిత విద్యలో భాగమే గురుకుల పాఠశాలలని అన్నారు. 7 ఎకరాలలో ఉన్నా ఈ పాఠశాల ఆవరణలోని ඊජාථ షెడు స్థానంలో స్లాబుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ క్లాస్రూమ్, ఆర్ ఓ ప్లాంటులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కిష్టారం గ్రామానికి ప్రత్యేకత ఉందని చెప్పారు. ఇక్కడ పాఠశాలలో చదువుకున్నవారు దేశ వ్యాప్తంగా గోప్ప నాయకులు, ప్రముఖులు ఆయ్యారని అన్నారు. ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా నిధులు విద్యకోసం కేటాయిస్తుందని చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకు ముందు పెనుబల్లి మండలం లంకపల్లిలో 98 లక్షలతో నిర్మించిన వెనుకబడిన తరగతుల బాలికల గురుకుల పాఠశాల నూతన భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. -
"కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి.యస్.లోకేష్కుమార్, అశ్వారావుపేట శాసన సభ్యులు తాటి వెంకటేశ్వర్లు, පුද්‍රිටක ඕරීඩාංඝජ వర్గం శాసన సభ్యులు క్రోరం కనకయ్య, zp ఛైర్పర్సన్ శ్రీమతి గడిపల్లి కవిత, డి.సి.సి.బి ఛైర్మన్ మువ్వా విజయ్బాబు తదితరులు పాల్గొన్నారు.





No comments:

Post a Comment